నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలు ఓటింగ్ కేంద్రాలను ఆర్డీవో పరిశీలించారు. 12 వార్డుల్లో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 24 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓటేసేందుకు వస్తున్న వృద్ధులకు పోలీసులు, యువకులు సహకరిస్తున్నారు.
విజయంపై ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
ఖానాపూర్ 12 వార్డుల్లో తెరాస విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రేఖానాయక్ ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్స్తో పాటు మున్సిపల్ ఛైర్మన్ పదవి తెరాస కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: చేతుల్లేకపోయినా.. ఓటేసి స్ఫూర్తినిచ్చాడు