నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు... మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ భూమి పూజ చేశారు. 10వ వార్టులో రూ.20 లక్షలతో చేపడుతున్న సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రానున్న రోజుల్లో 42 వార్డులో పనులు చేపడుతామని అన్నారు.
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మల్ జిల్లా అభివృద్ధిలో ముందుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'హనుమంతుడు జన్మించింది అంజనాద్రిలోనే'