నిర్మల్ జిల్లాలోని ముజ్గి మల్లన్న ఆలయంలో రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా నాల్గో రోజు రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏటా మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతర పురస్కరించుకొని భక్తులు తులాభారంతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ జాతరకు నిర్మల్ జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో ఓ కానిస్టేబుల్‌తో పాటు భక్తుడికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు