గ్రామ గ్రామాన రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ముధోల్ మండలం ఎడ్ బీడ్ గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు ఎలా జరుగుతాయి?.. డ్రైవింగ్ లైసెన్సు పొందడం ఎలా?.. తదితర అంశాలపై పోలీసు కళాజాత బృందంతో అవగాహన కల్పించారు.
గతేడాది జిల్లా వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయారని... వారిలో 80% మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారు ఉన్నారని తెలిపారు. వాహనదారులకు భద్రతా నియమాల పట్ల అవగాహన లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమనికి ఏడీపీ శ్రీనివాస్, డీఎస్పీ నర్సింగ్ రావు ఇతర అధికారులు హాజరయ్యారు.