నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన జాతర. ప్రతి ఏటా కన్నుల పండువగా నిర్వహిచడం ఆనవాయితీ. నిర్మల్ జిల్లా లక్ష్మణ్చందా మండలం ధర్మారం గ్రామంలో వెలసిన వానర దేవుని జాతరను ఘనంగా నిర్వహించారు. భక్తుల కోరికలను తీర్చే దేవునిగా ఇక్కడ ఆలయం ప్రసిద్ధి చెందింది. భక్తుల విరాళాలతో ఈ ఆలయాన్ని 1978లో నిర్మించారు.
ఏటా డిసెంబర్ నెలలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీప జిల్లాలైన నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.