ETV Bharat / state

అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్తంగా భక్తుల ఆందోళనలు

author img

By

Published : Dec 30, 2022, 5:59 PM IST

Updated : Dec 30, 2022, 6:14 PM IST

MLA Rajasingh demanded PD Act on OU student: హిందు దేవతల చరిత్రపై అసభ్యంగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఓయూ విద్యార్థిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అదే విధంగా నిర్మల్​లో అయ్యప్పస్వాములు నిరసనకు దిగారు.

అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు
అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత్‌ నాస్తిక్‌ సమాజ ప్రతినిధి, ఓయూ విద్యార్థి బైరి నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నిర్మల్‌లో అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు. ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బైరి నరేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలోనూ అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు.

హైదరాబాద్-బీజాపూర్‌ జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ధర్నా చేపట్టారు. చేవెళ్ల, మొయినాబాద్‌లో రోడ్డుపై నిరసనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై పీడీ యాక్ట్‌ పెట్టి అరెస్ట్ చేయాలని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఓ మతంపై మాట్లాడితే తనపై కేసు నమోదు చేశారని, అలాగే నరేశ్‌పైనా పీడీ యాక్టు పెట్టాలన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.