కరోనా వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా లాక్‌డౌన్ కోనసాగుతున్న క్రమంలో రైతుల మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు, రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల 92 వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగవ్వగా.. నిర్మల్ జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండిందన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పీఏసీఎస్ మార్క్ఫ్రెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1077 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నిర్మల్ జిల్లాలో 91 కేంద్రాలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 1760 చెల్లించనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: సొంతంగా మాస్కు తయారు చేసుకోవటం ఎలా?