ధరణి పోర్టల్ సేవలు చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలను మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గంలోనే తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.
రెవెన్యూ సంస్కరణల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. ధరణి పోర్టల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా క్రయ, విక్రయదారులకు సులభంగా అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.