ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించి నిర్మాణంలో ఉన్న పనులను ఆయన పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ ఆధ్వర్యంలో రూ.30 లక్షల నిధులతో ఆసుపత్రిని కొత్త హంగులతో నిర్మిస్తామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం, వైద్యుల కొరత లేకుండా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.
ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజని, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు, 21 మరణాలు