ETV Bharat / state

చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలి: ఇంద్రకరణ్​ రెడ్డి - సాగునీటిపై మంత్రి సమీక్ష

ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఆదేశించారు. నిర్మల్​ జిల్లాకేంద్రం​లోని శాస్త్రినగర్​లో ఉన్న తన నివాసంలో ఇరిగేషన్​, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

minister indrakaran reddy review meetin
ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
author img

By

Published : Apr 17, 2021, 9:44 PM IST

వ్యవసాయానికి నిరంతరంగా సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. నిర్మ‌ల్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ స‌ర‌స్వ‌తి కెనాల్ ద్వారా చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగునీరు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని శాస్త్రీన‌గ‌ర్​లోని త‌న నివాసంలో ఇరిగేషన్, ఆర్​డబ్ల్యూఎస్​ అధికారుల‌తో సమీక్ష నిర్వ‌హించారు.

స‌ర‌స్వ‌తి కాలువ నుంచి చివ‌రి ఆయ‌క‌ట్టుకు నీరు అంద‌డం లేద‌ని పెంబి మండ‌ల రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై వెంట‌నే స్పందించిన మంత్రి అధికారుల‌తో చ‌ర్చించారు. స‌ర‌స్వతి కాలువపై గాంధీన‌గ‌ర్ స‌మీపంలో ఆన‌క‌ట్ట నిర్మించి తాగు, సాగునీటిని మ‌ళ్లించ‌డం వ‌ల్ల 1500లకు గానూ 1000 క్యూసెక్కుల నీటినే రైతుల‌కు అందించాగ‌లుగుతున్నామ‌ని అధికారులు వివ‌రించారు.

క్రాస్​ రెగ్యులేటరీ నిర్మించాలి:

ఆన‌క‌ట్ట‌ను తొల‌గించి దానికి బ‌దులు క్రాస్ రెగ్యులేట‌రీని నిర్మిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని మంత్రికి వివరించారు. క్రాస్ రెగ్యులేట‌రీ నిర్మాణానికి సుమారు కోటి రూపాయల అంచనా వ్య‌యం అవుతుంద‌ని అధికారులు తెలిపారు. దీనికి స‌మ‌గ్ర ప్ర‌తిపాద‌న‌లు‌ రూపొందించాల‌ని...నిధులు మంజూరుకు త‌న‌వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ స‌మావేశంలో మాజీ డీసీసీబీ ఛైర్మ‌న్ రాంకిష‌న్ రెడ్డి, ఇరిగేష‌న్ ఎస్ఈ సుశీల్ కుమార్, ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంక‌టేశ్వ‌ర్లు, ఈఈ రామారావు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నోడ్యూ సర్టిఫికెట్లు తప్పనిసరి కాదు: ఎన్నికల సంఘం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.