తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్థి దశ నుంచే ఉద్యమాలలో పాల్గొని… ప్రజలను చైతన్య పరిచిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (minister indrakaran reddy) అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రం రూరల్ ఠాణా సమీపంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ప్రొఫెసర్ జయశంకర్ (acharya jayashankar ) అని మంత్రి కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్