నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో రూ. 15 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపుగా ఐదు వందల ఆలయాల నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్ అల్లోల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏజెన్సీ జిల్లాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: పువ్వాడ