ETV Bharat / state

రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్​ రెడ్డి

author img

By

Published : Apr 18, 2021, 6:38 PM IST

సీఎం కేసీఆర్​ చొరవతో రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్​పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రామాలయం ప్రొసీడింగ్ కాపీని గ్రామస్థులకు అందజేశారు.

minister indrakaran reddy
ఆలయ నిర్మాణానికి ప్రొసీడింగ్​ కాపీని అందజేస్తున్న మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక నూతన ఆలయాలను నిర్మించామని పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్​పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రామాలయం ప్రొసీడింగ్ కాపీని తన క్యాంపు కార్యాలయంలో గ్రామస్థులకు అందజేశారు.

నిర్మల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500 ఆలయాలను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ఓస రాజేశ్వర్, తెరాస మండల ఇంఛార్జ్​ అల్లోల సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, నాయకులు కేశం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్​మెంట్ ఉంది: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.