పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో పోలీసులు నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ... ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. అనంతరం పోలీసులు వందనం సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన త్యాగాలు ఎల్లవేళలా స్మరించుకోవాలని మంత్రి సూచించారు. వారు విధులు నిర్వహించడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అందుకు ప్రభుత్వం పోలీసులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూర్తి చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పట్టు బిగించిన టీమిండియా.. కష్టాల్లో సఫారీలు