ETV Bharat / state

మార్కెట్‌ యార్డులను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర: మంత్రి ఇంద్రకరణ్‌ - నిర్మల్‌లో బైక్‌ ర్యాలీ

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌.. నిర్మల్‌ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రైతులకు మద్దతుగా బంద్‌ పాటించాలనే పిలుపునకు సహకరించిన ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

minister indrakaran and trs activists bike rally in nirmal
మార్కెట్‌ యార్డులను ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర: మంత్రి ఇంద్రకరణ్‌
author img

By

Published : Dec 8, 2020, 1:04 PM IST

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్..‌ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తెరాస పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు.

కేంద్రం కుట్ర

రైతులు పండించిన పంటని కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఇంద్రకరణ్‌ మండిపడ్డారు. దీనికి తోడు మద్దతు ధరతో కొనుగోలు చేసే మార్కెట్ యార్డులను ఎత్తివేయాలని చూస్తోందని ఆరోపించారు. అనంతరం రైతుల ఆందోళనకు మద్దతుగా రాష్ట్రంలో బంద్ పాటించాలని ఇచ్చిన పిలుపునకు సహకరించిన ప్రజలందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: షాద్‌నగర్ బూర్గుల గేట్‌ వద్ద నిరసనలో పాల్గొన్న కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.