బడ్జెట్లో మహిళా సంఘాలకు అత్యధిక నిధులు కేటాయించామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న 4.29 లక్షల స్వయం సహాయక సంఘాలకు విడతల వారిగా వడ్డీలేని రుణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి , మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, స్థానిక కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం