రాష్ట్రంలోని దేవాలయాలకు మంచిరోజులు రానున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఆలయాలను నిర్మించుకున్నామని గుర్తుచేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్లో రూ.15లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రాజరాజేశ్వరి ఆలయనిర్మాణానికి భూమిపూజ చేశారు.
రాష్ట్రంలో దాదాపు 400 ఆలయాలకు నిధులు మంజూరు చేశామన్నారు. నిరాదరణకు గురైన ఆలయాలకు దూపదీప నైవేద్యం పథకంతో పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ రాంకిషన్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...