ETV Bharat / state

కార్మికులకు మే'డే' శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అల్లోల - INAGURATED WORKERS FLAG

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురపాలిక కార్యాలయం ముందు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్మిక జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు మరిచి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక వేడుక మే'డే' అని మంత్రి అన్నారు.

కార్మిక జెండా ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

author img

By

Published : May 1, 2020, 8:03 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కార్మిక జెండా ఆవిష్కరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కార్మిక లోకానికి మే'డే' సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుంచి దివ్య గార్డెన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఐకేఆర్ ఫౌండేషన్ తరఫున ఆటో రిక్షా కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

మే '7' వరకు కొనసాగాలి...

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మే 7 వరకు ఇంటి వద్దే ఉండాలని సూచించారు. కరోనా నివారణకు స్వీయ నిర్బంధం, సామాజిక దూరమే ప్రధానమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు చేపట్టిందన్నారు. కార్మికులు, వారి కుటుంబాల శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికులు, సంఘ‌టిత‌, అసంఘ‌టిత కార్మికుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ విజయ లక్ష్మి, గ్రంథాలయ జిల్లా ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ ఛైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తెరాస టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : భారత్​కు వచ్చేందుకు ఒక్కరోజే 32 వేల మంది దరఖాస్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.