ETV Bharat / state

దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల - Minister Allola indrakaranreddy latest news

నిర్మల్​ పట్టణంలోని శ్రీ నంది గుండం దుర్గామాత అమ్మవారికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి బోనాలు సమర్పించారు. కరోనా దృష్ట్యా ప్రజలంతా ఇళ్లలోనే ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.

Minister Allola presented bonam to Durgamata Amma
దుర్గామాత అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల
author img

By

Published : Jul 19, 2020, 2:22 PM IST

కరోనా వైరస్​ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలోనే బోనాలను సమర్పించుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. బోనాల పండగ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని శ్రీ నంది గుండం దుర్గామాత అమ్మవారికి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు, బోనాలను సమర్పించారు.

కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే బోనాల పండగను జరుపుకోవాలని మంత్రి కోరారు. ప్రతి ఏటా కన్నుల పండగగా జరుపుకునే పండగ.. ఈసారి నిరాడంబరంగా జరుపుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. పరిస్థితులను గమనించి ఉత్సవాలను జరపుకోవాలని ప్రజలకు సూచించారు.

రాబోయే రోజుల్లో దుర్గామాత ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు వివరించారు.

ఇదీచూడండి: అధికారుల నిర్లక్ష్యం... హరితహారం వైఫల్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.