ప్రతి ఒక్కరూ కొవిడ్ నివారణ టీకా వేయించుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానాలో మంత్రి దంపతులు తొలి డోసు తీసుకున్నారు.
వారితోపాటు జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి దంపతులు కొవిడ్ టీకా వేయించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా, ప్రాంతీయ వైద్యాధికారులు డా.ధనరాజ్, డా.వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షకులు డా.దేవేందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
ఇదీ చూడండి: గిరిజనులకు పౌష్టికాహారం అందుబాటులో ఉంచాలి: తమిళిసై