నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం మూటపూర్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాస్త సహనం కోల్పోయి ఆవేశంగా ప్రసంగించారు. పరిషత్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి సభకు ప్రజలు ఎక్కువగా హాజరుకాలేదని కోపంతో ఊగిపోయారు. ఈ ఎన్నికల్లో మీ గ్రామంలో తెరాసకు మెజారిటీ రాకుంటే అభివృద్ధి పనులు నిలిపివేస్తానని హెచ్చరించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులంతా చర్చించుకొని కారు గుర్తుకు ఓటేయాలని హుకూం జారీ చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడతారా అని ప్రజలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
ఇవీ చూడండి: కాజీపేట రైల్వే లోకో షెడ్ సమీపంలో అగ్ని ప్రమాదం