కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును రద్దుచేయాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో వామపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని గాంధీ పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పౌరసత్వ బిల్లు మత రాజకీయంగా ఉందని నాయకులు ఆరోపించారు. భారతదేశంలో అన్ని మతస్థుల వారు జీవించే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని.. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: భారత్లో శాంతిని చూడలేకే చొరబాట్లు: అమిత్ షా