నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సాగుభూమిని కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారు. గతంలో వారికి పట్టాలు ఇచ్చినా ప్రభుత్వం భూములు చూపకపోవడం వల్ల నిరుపయోగంగా మారిపోయాయి. దాదాపు గ్రామంలోని 7 కుటుంబాలకు 48.12 ఎకరాల్లో వారికి సాగు చేసుకునేందుకు పట్టాలిచ్చారు.
వారి పూర్వీకులు కొంతకాలం సాగుచేసి వదిలేయగా బీడు భూములుగా మారిపోయాయి. పట్టాదారులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని కేటాయిస్తే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే కబ్జాదారులు భూమిని ఆక్రమించుకుంటున్నారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.