నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 87 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ గ్రామం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దొంగతనాల విషయం వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా ఇప్పటివరకు 29 దొంగతనాలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ముఠాలో 10 మంది సభ్యులు ఉండగా మహారాష్ట్రకు చెందిన వెంకటి గైక్వాడ్ (34), నగేశ్ బాలాజీ కసార్కర్ (24) అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి : 71గొర్రెలకు భార్యను ప్రియునికి అమ్మేసి మోసపోయాడు!