ETV Bharat / state

ఆ ఊళ్లో అంతా హెల్మెట్​ ధరిస్తారు... ఎందుకంటే?

పోలీసుల నిర్బంధ తనిఖీలు నిర్మల్​ జిల్లా డ్యాంగాపూర్​లో సత్ఫలితాలనిచ్చాయి. గ్రామంలోని వాహనదారులంతా ఏకమై శిరస్త్రాణాలు ఖరీదు చేశారు. వారిని చూసి మిగతా వారు కూడా హెల్మెట్​ ధరించి వాహనం నడపాలనే ఉద్దేశంతో శిరస్త్రాణం ధరించి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

నిర్మల్​ జిల్లాలో హెల్మెట్​ ర్యాలీ
author img

By

Published : Oct 28, 2019, 6:35 PM IST

నిర్మల్​ జిల్లాలో హెల్మెట్​ ర్యాలీ

నిర్మల్ జిల్లాలో పోలీసులు చేపడుతున్న నిర్బంధ తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. మూడు రోజుల క్రితం డ్యాంగాపూర్​లో చేపట్టిన తనిఖీల్లో భాగంగా.. ద్విచక్ర వాహనాలు శిరస్త్రాణం ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన డ్యాంగాపూర్​ గ్రామస్థుల్లో మార్పు తీసుకువచ్చింది. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులంతా ఏకమై శిరస్త్రాణాలు ఖరీదు చేశారు. వారిలో వచ్చిన మార్పును ప్రతి ఒక్కరు చూడాలని, తమలాగే అందరూ హెల్మెట్​ ధరించాలనే ఉద్దేశంతో శిరస్త్రాణం ధరించి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. వీరిని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అభినందించి ప్రతి ఒక్కరు డ్యాంగాపూర్ గ్రామస్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Intro:TG_ADB_33_28_HELMET RALLY_AVBK_TS10033
పోలీసు నిర్బంధ తనిఖీలతో సత్ఫలితాలు..
గ్రామంలోని ద్విచక్ర వాహన దారులు అంతా హెల్మెట్ ఖరీదు..
గ్రామం నుండి జిల్లా కేంద్రంలోని డిఎస్పి కార్యాలయం వరకు ర్యాలీ..
_____________________________________________
నిర్మల్ జిల్లాలో పోలీసులు చేపడుతున్న నిర్బంధ తనిఖీలు సత్ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు .గత మూడు రోజుల క్రితం నిర్మల్ మండలం డ్యాన్గాపూర్ గ్రామంలో పోలీసుల నిర్బంధ తనిఖీల అనంతరం గ్రామస్తులకు ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్లు ధరించాలని, హెల్మెట్ లేకుంటే జరిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. అయితే రెండు రోజులు తిరగకముందే ఆ గ్రామం లో మార్పు చోటుచేసుకుంది. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అందరూ ఏకమై ద్విచక్ర వాహనదారులు అంతా హెల్మెట్లు ఖరీదు చేశారు. వారి మార్పును ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతో తమ గ్రామం నుండి నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిఎస్పి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు .వీరిని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అభినందించి ప్రతి ఒక్కరు డ్యాంగాపూర్ గ్రామస్తులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిటీ నంబర్714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.