నిర్మల్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో.. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి భారీగా వరుస కట్టారు.
స్వామివారి ఉత్సవ విగ్రహాలను బాజా భజంత్రీల నడుమ ఆలయ పురవీధుల గుండా ఊరేగించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీచూడండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు