ETV Bharat / state

కుటుంబీకుల జాడ కోసం పాకిస్థాన్​ నుంచి బాసరకు.. - Geetha came to basara

20 ఏళ్ల కిందట తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన గీత అనంతరం అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహకారంతో స్వదేశానికి చేరింది. ఇవాళ వారి కుటుంబీకుల జాడ కోసం బాసరకు వచ్చింది.

కుటుంబీకుల జాడ కోసం బాసర వచ్చిన గీత
కుటుంబీకుల జాడ కోసం బాసర వచ్చిన గీత
author img

By

Published : Dec 15, 2020, 4:27 PM IST

Updated : Dec 15, 2020, 5:12 PM IST

కుటుంబీకుల జాడ కోసం బాసర వచ్చిన గీత

నిర్మల్ జిల్లా కుటుంబ సభ్యుల జాడ కోసం బధిరురాలైన గీత బాసర పట్టణానికి వచ్చింది. మధ్యప్రదేశ్​కు చెందిన స్వచ్ఛంద సంస్థ సాయంతో కుటుంబ సభ్యుల జాడ కోసం వచ్చింది. 20 ఏళ్ల కిందట తప్పిపోయి పాకిస్థాన్‌ చేరింది. ఐదేళ్ల కిందట విదేశాంగశాఖ సహకారంతో స్వదేశానికి వచ్చిన గీత... స్వచ్ఛంద సంస్థ సహకారంతో కుటుంబీకుల జాడ కోసం వెతుక్కుంటూ బాసర వచ్చింది.

గీత బధిరురాలు కావడం వల్ల తాను చిన్నప్పుడు ఉన్న ప్రాంతంలో గోదావరి పక్కన గుడి, రైల్వే బ్రిడ్జ్ ఉన్నట్లు ఆమె సొసైటీ వారికి తెలిపింది. ఈరోజు గీతను బాసరకు తీసుకుని వచ్చారు. దివ్యాంగురాలు గీత 20 ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ ఉన్న సేవ సంస్థ ఈద్ ఫౌండేషన్​లో 15 సంవత్సరాలు ఉంది. ఫౌండేషన్ వారు గీత అని నామకరణం చేశారు.

ఈ విషయం అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి రావడం వల్ల గీతను స్వదేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఓ సేవ సంస్థలో ఆశ్రయం పొందుతోంది. తాను కుటుంబీకుల వద్దకు వెళ్తానని గీత అనగా... ఆనంద్ సర్వీస్ సొసైటీ వారు ఆమెను ఎలాగైనా కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

ఫౌండేషన్​ సభ్యులు మహారాష్ట్రలో కొన్ని రోజులు వెతికారు. ఈరోజు బాసరకు చేరుకొని గోదావరి ప్రాంతంలో గల పరిసరాలను గీతకు చూపించారు. బిడ్జ్​పై తీగల లాంటి వంగడాలు ఉన్నాయని తమ వద్ద వరి బాగా పండిస్తారని గీత ఫౌండేషన్ సభ్యులకు తెలిపింది.

ఇదీ చూడండి : రిజిస్ట్రేషన్ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Last Updated : Dec 15, 2020, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.