నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజాలో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి.. తోటి ఉద్యోగులు తమ వంతు సాయంగా పండ్లు, పాలు, కోడిగుడ్లు, మందులు పంపిణీ చేశారు. కరోనాతో బాధపడుతున్న సహచరులకు ధైర్యం చెప్పారు. పౌష్టికాహారం తీసుకొని సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టోల్‌ప్లాజా ఉద్యోగులు గంగాధర్, విక్రమ్, రాజు, మురళి, నవీన్, సురేష్, మహేష్. అజహర్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్