ETV Bharat / state

కాళ్లరిగేలా తిరిగినా కనికరించరేమి అంటున్న రైతులు

గుంట భూమి ఉన్నా చిరిగిపోని పట్టాదారు పాస్​పుస్తకం ఇస్తాం. ఏడాదిలో రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తాం. రైతు కుటుంబానికి ఆసరాగా రైతుబీమా కల్పిస్తాం. ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో చెప్పిన మాటలు. రాజధానిలో సీఎం ఆలోచనలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో అధికారుల తీరు ఇందుకు భిన్నంగా ఉంది.  అన్నదాతలను కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. పాస్​బుక్​లు ఇవ్వకుండా ఆవేదనకు గురి చేస్తున్నారు.

రెవెన్యూ శాఖ కార్యాలయం
author img

By

Published : Mar 30, 2019, 12:09 AM IST

Updated : Mar 30, 2019, 7:48 AM IST

కాల్లారిగేలా తిరిగినా కనికరించరేమి అంటున్న రైతుల
ఈ రోజు వస్తే రేపు రమ్మంటున్నారు. రేపు వస్తే ఎల్లుండి రమ్మంటున్నారు. ఎల్లుండి వెళ్తే సార్​ లేడు అంటున్నారు. ఇలా సంవత్సరాలు గడుపుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆవేదనకు గురి చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు. రెవెన్యూ సిబ్బంది తప్పిదాలతో కొత్త పాస్​ పుస్తకాలు అందుకోలేక, రైతుబంధుకు నోచుకోలేక, రైతుబీమాకు దరఖాస్తు చేసుకోలేక నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలంలోని వందలాది అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ఒక్క పైసా కూడా రాలేదు

లక్ష్మణ్ అనే రైతుకు వారసత్వంగా 3.15 ఎకరాల భూమి వచ్చింది. పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా రాలేదని చెబుతున్నాడు. అధికారుల చుట్టు తిరిగినా కొత్త పాస్​ పుస్తకాలు ఇవ్వలేదని ​ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నకారు రైతులను ఇలా చేయడం సరైంది కాదన్నాడు.

ఒకే సర్వే నంబర్​ అయినా

పుస్పూర్ గ్రామానికి చెందిన వీరేశ్​కు 6.02 ఎకరాల భూమి ఉంది. ఇదే సర్వే నంబరు​లో ఉన్న అమ్మకు, అన్నకు రైతు బంధు డబ్బులు వచ్చాయని తనకేమో రాలేదని వాపోయాడు. అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోలేదన్నాడు. చాలా మంది అన్నదాతల పరిస్థితి ఇదే విధంగా ఉంది.

త్వరలో మిగిలిన వారికి

లోకేశ్వరం తహసీల్దార్ శ్రీదేవిని వివరణ కోరగా తను లోకేశ్వరానికి ఎన్నికల విధుల కోసం బదిలీపై వచ్చానని తెలిపారు. ఈ ఎన్నికల హడావుడిలో ఉన్నామని ఇప్పటికే 700 మంది రైతులకు పట్టాదారు పాస్​ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందజేస్తామని వెల్లడించారు.

అధికారులు వీలైనంత త్వరగా తమకు పట్టాదారు పాస్​ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.
ఇవీ చూడండి:'ఓటు స్లిప్పుల లెక్కపై మా పద్ధతే ఉత్తమం'

Intro:TG_ADB_60_MUDL_ARU NELALU TIRIGINA ANDANI PATTA PASS BOOKS_PKG_C12

కల్లారిగేలా తిరిగిన కనికరించారేమి..
ఆరు నెలలు దాటినా అందని పట్టదారు పసుపుస్తకాలు

గుంట భూమి ఉన్న ఆ రైతుకు జీవితంలో చిరిగి పోకుండా వుండే పట్టాదారు పసుపుస్తకం ఇస్తాం.. ఏడాదిలో రెండు పంటలకు అవసరమైన పెట్టుబడి సాయం అందిస్తాం,ఆ రైతు కుంటుంబానికి ఆసరాగా ఉండేలా రైతుబీమా పతాకాన్ని కొనసాగిస్తాం..ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం .రాజధానిలో ఆయన ఆలోచనలు ఇలా ఉంటే క్షేత్ర స్థాయిలో మాత్రం రెవిన్యూ ఊ సిబ్బంది పని తీరు ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది రైతులు కాళ్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరిగిన చేతులు తడిపేసి గాని పట్టాదారు పాసుపుస్తకం చేతికి ఇవ్వమని తీరుగా ఉంది ది వార్ ఈ వ్యవహారం అం గ్రామ రెవెన్యూ కార్యదర్శుల తప్పిదం తో కొత్త పసుపుస్తకాలు అందుకోలేక ,రైతుబందుకు నోచుకోలేక ,రైతుబీమా కు దరఖాస్తు చేసుకోలేక లోకేశ్వరం మండలంలో వందలాది రైతులు దీనవస్థలో ఉన్న రైతు తీరుపై ఈటీవీ కథనం

లోకేశ్వరం మండలంలో మొత్తం వ్యవసాయ అధికారులు రికార్డుల ప్రకారం 10,389 మంది రైతులు వున్నారు.ఇందులో వ్యవసాయ కార్యాలయంలో పూర్తి వివరాలు అందజేషిన వారు 9396 మంది రైతులుండగా ఒక్కరు మినహా అందరి వివరాలను ఆ శాఖ అధికారులు ఖజానా శాఖకు పంపినారు ఈ ఏడాది రబి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఇందులో నుంచి 8457 మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అంసించింది.మిగిలిన 938 మంది పట్టాదారు పసుపుస్తకం అందక కొందరు అందులో ఉన్న పేర్లు,ఆధార్,భ్యాంకు కతాలతో సరిపోక మరికొందరు రైతులు రైతుబంధు పాతాకానీకి నోచుకోలేక పోయారు

వాయిస్ ఓవర్ 1 () లోకేశ్వరం మండలం పూస్పుర్ గ్రామానికి చెందిన కోండి రాజన్న-లక్ష్మీ దంపతుల కుటుంబంలో రాజన్నకు 5.29 ఎకరాలు,ఆయన భార్య లక్ష్మీ పేరును 2.33 ఎకరాలు,ఆయన కుమారుడు యోగేష్ పెరునా 1.28 ఎకరాలు మొత్తం 9.30 ఎకరాల భూమి ఉంది వీరికి వారసత్వం గా ఈ భూమి వచ్చింది ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన వీరికి కొత్త పట్టాదారు పసుపుస్తకం అందించకపోవడంతో రెండు సార్లు రైతుబందు సాయనికి నోచులేకపోయామని రైతుబీమా కూడా దరఖాస్తు చేసుకోలేక పోయామంటున్నారు

బైట్ రైతు రాజన్న

వాయిస్ ఓవర్2() పుస్పూర్ గ్రామానికి చెందిన విరేశ్ కు 6.02 ఎకరాల భూమి ఉంది మా ఇంట్లో మా అమ్మకు,అన్నకు, రైతు బంధు డబ్బులు వస్తున్నాయి నాకేమో వస్థలేవు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన ఎవరు పాటించుకోవడం లేదని పెట్టుబడి సాయం కూడా తమకు దక్కడం లేదని అంటున్నారు

బైట్2 :విరేశ్ రైతు

వాయిస్ ఓవర్ 3() లక్ష్మణ్ కు చెందిన భూమి వారసత్వం గా వచిందని తనకు 3.15 గుంటల భూమి ఉంది ప్రభుత్వం తరపున వచ్చే పెట్టుబడి సహాయం కింద తమకు ఒక్క పైసా కూడా రావడం లేదు నేను చిన్నకారు రైతులం ఇపుడున్న కాలంలో పంటలు సరిగ్గా పండడం లేదు ఇప్పుడీ దాకా కొత్త పట్టపసుపుస్తకాలు రాలేదు త్వరగా వచ్చే విదంగా చూడాలని అంటున్నారు

బైట్3 :లక్ష్మణ్ రైతు

వాయిస్ ఓవర్ లోకేశ్వరం తహసీల్దార్ మాట్లాడుతూ లోకేశ్వరం మండలానికి ఎన్నికల డ్యూటీ పై ఆదిలాబాద్ నుండి బదిలీ పై వచ్చను ఈ ఎన్నికల అడవిడిలో 700వరకు రైతులకు పట్టాదారు పసుపుస్తకాలు పంపిణీ చేసాము మిలిగిలినవి కూడా అతితోందలలో రైతులకు పట్టపసుపుస్తకాలు అందజేస్తామని అన్నరు

బైట్4 శ్రీదేవి లోకేశ్వరం తహశీల్దార్

Body:లోకేశ్వరం

Conclusion:లోకేశ్వరం
Last Updated : Mar 30, 2019, 7:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.