ETV Bharat / state

నిర్మల్ జిల్లాలో అంబరాన్నంటిన జెండా పండుగ సంబరాలు - Independence day celebrations in nirmal

నిర్మల్ జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనల మేరకు వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అతి ఎత్తైన జాతీయ పతాకాన్ని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.

నిర్మల్ జిల్లాలో అంబరాన్నంటిన జెండా పండుగ సంబరాలు

author img

By

Published : Aug 15, 2020, 2:23 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అతి ఎత్తైన జాతీయ పతాకాన్ని దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.37 లక్షలతో 150 అడుగుల ఎత్తున 48 అడుగుల జాతీయ పతాకం ఏర్పాటు చేశారు.

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 150 అడుగుల జెండా రెపరెపలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, జడ్పీ ఛైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ముధోల్ లో...

నిర్మల్ జిల్లా ముధోల్ పోలీస్ కార్యాలయంలో 74వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసులు వారి కుటుంబసభ్యులతో పాటు చిన్నారులు పాల్గొన్నారు. చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని కొవిడ్ ను తరిమికొట్టేందుకు తమ కుటుంబ సభ్యులు చేస్తున్న కృషిని చిన్నారులు తెలియచేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఇంట్లోనే ఉండాలని అత్యవసర సమయంలో తప్పితే బయటకు రాకుండా ఉండాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.