ETV Bharat / state

తమను విధుల్లోకి తీసుకోవాలని కలెక్టరెట్‌ ఎదుట ఫీల్డ్‌ అసిస్టెంట్ల ధర్నా

ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లును విధుల్లోకి తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వెంటనే 4779 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Sep 28, 2020, 6:56 PM IST

FIELD ASSISTANT
FIELD ASSISTANT

పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 7,651 మందిని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. వెంటనే 4779 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించి, కరోనా కష్టకాలంలో ఆదుకోవాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాజన్న కోరారు. ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయేందర్, విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : రెండేళ్ల చిన్నారికి దెయ్యం పట్టిందని కొట్టి చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.