నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం చిన్న చెరువును తలపిస్తోంది. ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తరలిస్తే... వర్షం వచ్చి తమకు కన్నీళ్లు మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజులుగా కొనుగోళ్లు వేగవంతం చేయాలని... ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఎంత మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. తరలించేందుకు లారీలు లేక రైతులే లారీల కోసం తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారు జామునే వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకోలేకపోయామని చెబుతున్నారు. నాణ్యమైన ధాన్యాన్ని పంపిస్తేనే వంకలు పెట్టే వ్యాపారులు... ఇప్పుడు తడిసిన ధాన్యానికి ఎన్ని వంకలు పెడతారోనని దిగులు చెందుతున్నారు.
ఇవీ చూడండి: పోస్టింగ్ లేక కూలీ పని చేసుకుంటున్న డిప్యూటీ ఎమ్మార్వో