ETV Bharat / state

అందరి గొంతు తడిపే ఎడ్‌బిడ్‌లో ఎడారి కష్టాలు! - water problems in edbid nirmal

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మిషన్ భగీరథ' పథకం అధికారుల పర్యవేక్షణ లేమి, సంబంధిత గుత్తేదారుల అలసత్వంతో నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో నీరుగారిపోయింది. ఫలితంగా గ్రామస్థులకు చుక్క నీరందడం లేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన సంపుల నుంచి మండలంలోని 12 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. కానీ ఈ గ్రామానికి మాత్రం నీటిని అందించలేకపోతున్నారు. వారు పడుతున్న అవస్థలపై 'ఈటీవీ భారత్'‌ ప్రత్యేక కథనం

edbid, miision bhageeratha
ఎడ్‌బిడ్‌
author img

By

Published : Jan 25, 2021, 1:56 PM IST

ఎడ్‌బిడ్‌ గ్రామంలో సుమారుగా 2 వేల జనాభా ఉంటుంది. జనాభా ప్రాతిపదికన ముథోల్‌ మండలం తర్వాత అధిక జనాభా ఈ గ్రామంలో ఉంటుంది. గ్రామంలోని వారందరకీ నీటిని సరఫరా చేయడానికి లక్ష లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు, భైంసా నుంచి మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడానికి రెండు సంపులను ఏర్పాటు చేశారు. వీటికోసం గ్రామస్థులు స్థలం సైతం ఇచ్చారు. కానీ ఈ గ్రామంలో ఇంతవరకు పైప్‌లైన్ పూర్తికాలేదు. గత్యంతరం లేక ఊరి ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు .

ప్రభుత్వం ఇంటిటికీ నల్లా అని చెప్పింది కానీ తమకు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటికోసం చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం తాగడానికి ప్రైవేటుగా మినరల్ వాటర్ కొనుక్కుంటామని వెల్లడించారు.

మిషన్‌ భగీరథ నీళ్లు రాక మంచి నీటిని కిలోమీటర్‌ వెళ్లి తెచ్చుకుంటున్నాం. గ్రామంలో ఒక్క నల్లా కూడా లేదు. ఇంతకు ముందు వచ్చినట్టు కూడా ఇపుడు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని తాగునీటిని అందించాలి.

శిరీష, గ్రామస్థురాలు

మా గ్రామంలో ఏడు గ్రామాలకు పంపించడానికి నీటి ట్యాంకును కట్టారు కానీ మా ఊరికే రావు. ఇక్కడ నీటి పంపిణీ చేయకపోతే ఏ గ్రామానికి కూడా పోనివ్వకుండా అడ్డుకుంటామని వెళ్లడంతో మిషన్ భగీరథ అధికారులు వచ్చి నీరు అందేటట్లు ప్రయత్నం చేస్తామని అన్నారు. హామీ ఇచ్చి 3 నెలలయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

గంగాధర్, గ్రామస్థుడు

మిషన్ భగీరథ పథకం మా గ్రామంలో పూర్తి కాలేదు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. తాగు నీటి విషయంలో చాలా ఇబ్బందు ఎదుర్కొంటున్నాం. వచ్చేది వేసవి కాలం కాబట్టి తొందరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నాం.

స్వర్ణలత, సర్పంచ్

మిషన్‌ భగీరథ నీటిని అందించాలంటూ గ్రామస్థుల విజ్ఞప్తి

ఇదీ చదవండి: పెళ్లి విషయంలో మనస్పర్థలు... ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.