నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఘాట్ వద్ద పిచ్చికుక్క దాడిలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం గోదావరి స్నాన ఘట్టాల వద్ద భక్తులు సేద తిరుతున్న సమయంలో ఆకస్మికంగా పిచ్చి కుక్క దాడి చేసింది.
ఈ దాడిలో విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన భవదీప్‌కు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన దత్తురాం జాదవ్‌కు గాయాలయ్యాయి. భవదీప్‌కు స్వల్ప గాయాలు కాగా.. దత్తురాం ముఖానికి తీవ్రంగా గాయమైంది. వెంటనే స్పందించిన స్థానికులు వారిని బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి