నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌లో ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 1 ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడం, నేరాల నియంత్రణ కొరకే ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నేర నివారణ చర్యల్లో భాగంగా అందరూ కలిసి గ్రామంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అత్యవసర సమయంలో డయల్ 100 సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు.
పూర్తి సమాచారం: పనివాళ్లుగా చేరారు... ఇళ్లను కొల్లగొట్టారు...