కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ కల్పన కల్పిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు విస్మరిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా.. వర్షంలోనూ ఆందోళన