నిర్మల్ జిల్లా కేంద్రంలోని మేడిపల్లి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా సీటు బెల్ట్, హెల్మెట్లు ధరించాలని ఎస్పీ శశిధర్ రాజు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటి వాటిని బాధ్యతగా పెంచి... భావితరాలకు ప్రాణవాయువును అందించాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రీ పెయిడ్.. పోస్ట్ పెయిడ్.. ఏ ప్లాన్ ఉత్తమం..!