ఆశ్రమం పాఠశాలలో భోజనం బాగాలేదు అన్నందుకు తోటి విద్యార్థులే కొట్టారంటూ నందకిశోర్ అనే విద్యార్థి నిర్మల్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. నిర్మల్ జిల్లా రాణాపూర్లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న నందకిశోర్ ఇవాళ భోజనం నాణ్యతగా లేదని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న వసతిగృహం సంక్షేమాధికారి ఆగ్రహంతో... సహచర విద్యార్థులతో తనపై దాడి చేయించాడని నందకిశోర్ ఆరోపించాడు. తోటి విద్యార్థుల దాడిలో కన్నుపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. విద్యార్థి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు'