నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని... కాంగ్రెస్, భాజపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెరాస నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్ష నేతలను పట్టించుకోవడం లేదని... కౌన్సిలర్ ఉమారాణి అన్నారు. ప్రతి నెలా నిర్వహించే సర్వసభ్య సమావేశంలో ఎలాంటి సమస్యలు చర్చించకుండానే మున్సిపల్ ఛైర్మన్ సమావేశాన్ని ముగిస్తున్నారని అన్నారు.
మున్సిపల్ కార్యాలయంలోని ప్రతి విభాగంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని... సమాచారం అడిగినా స్పందించడం లేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ హామీ ఏమైంది..?: జీవన్ రెడ్డి