ETV Bharat / state

శ్రీశైలం నుంచి అయోధ్య వరకు... చిన్నారుల సైకిల్ యాత్ర

ఎనిమిది నుంచి 18 సంవత్సరాల్లోపు వయసున్న పిల్లలు శ్రీశైలం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా... ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

శ్రీశైలం నుంచి అయోధ్య... చిన్నారుల సైకిల్ యాత్ర

author img

By

Published : Feb 23, 2021, 5:22 PM IST

వారంతా ఎనిమిది నుంచి 18 సంవత్సరాల్లోపు వయసున్న పిల్లలు. అడవుల్లో నివాసముండే చెంచు జాతికి చెందిన వారు. చదువుకునేందుకు ఉండేందుకూ వసతులు కరవు. చెప్పేవారు, పట్టించుకునేవారు లేకపోవడం వల్ల చెడు అలవాట్లకు బానిసవడం పరిపాటి. అలాంటి ప్రాంతంలో ఉన్న చిన్నారులను సన్మార్గంలో నడిపించాలని, వాళ్ల పరిస్థితిని మార్పుచేయాలని భావించి గనిత్యోగ అనే సంస్థ ఆధ్వర్యంలో సైకిల్ యాత్రకు ఉపక్రమించారు.

మొత్తం 20 మంది విద్యార్థులు సైకిళ్లపై దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. వంశీధర్ కాళిదాసు నేతృత్వంలో వీరంతా ఫిబ్రవరి 6న శ్రీశైలం నుంచి యాత్ర మొదలెట్టారు. ఇప్పటికే 630 కిలోమీటర్ల మేర ప్రయాణం పూర్తి చేసుకొని నిర్మల్ జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకున్నారు.

సైకిల్ యాత్రలో చిన్నారులు
సైకిల్ యాత్రలో చిన్నారులు

అయోధ్య సహా ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లే క్రమంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతోందని, స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకుంటూ మేధస్సును పెంపొందించుకుంటున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థుల ర్యాలీకి నిర్మల్​లో స్థానిక నాయకులు, పలువురు స్వాగతం వలికారు. పిల్లలకు పండ్లు, నగదుసాయం అందించారు.

శ్రీశైలం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర
శ్రీశైలం నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర

ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.