ETV Bharat / state

చెరువు భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి:కలెక్టర్ - నిర్మల్ జిల్లా తాజా సమాచారం

నిర్మల్​ జిల్లా వ్యాప్తంగా చెరువు భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చెరువు భూముల సర్వేపై రెవెన్యూ, పురపాలక, సర్వే, నీటిపారుదల అధికారులతో తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Cheruvula lands survey sameeksha
చెరువుల భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలి:కలెక్టర్
author img

By

Published : Oct 13, 2020, 9:43 PM IST

నిర్మల్​ జిల్లాలోని చెరువుల భూములకు సంబంధించిన సర్వేను నెలరోజుల్లో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్​ ముషారఫ్ ఫారుఖీ ఆదేశించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రెవెన్యూ, పురపాలక, నీటిపారుదల, సర్వే అధికారులతో సమావేశమయ్యారు.

చెరువుల భూములు ఆక్రమణకు గురికాకుండా తీసుకుంటున్న చర్యలపై డిసెంబర్ 4 న హైకోర్టుకు నివేదిక సమర్పించాలన్నారు. బుధవారం నుంచి సర్వేను ప్రారంభించి అధికారులంతా సమన్వయంతో పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, సర్వే అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సాదాబైనామాలకు మరో అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.