రాత్రి వికసించే పుష్పంగా పేరుగాంచిన ఈ అపురూపమైన బ్రహ్మకమలాలు.. శనివారం రాత్రి 9 గంటల సమయంలో వికసించాయి. ఒక దాని వెనుక ఒకటి వికసిస్తూ నాలుగు పువ్వులు పూశాయి. ఎంతో అరుదైన పుష్పాలు తమ ఇంట్లో వికసించటం ఎంతో ఆనందంగా ఉందని మహేశ్ కుటుంబసభ్యులు తెలిపారు. బ్రహ్మకమలాలు వికసించటం చూసేందుకు ఎన్నో ఎళ్లుగా ఎదురుచూస్తున్న తాము ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఎన్నో ఏళ్లకు గానీ.. వికసించని ఆ పుష్పాలకు పూజలు నిర్వహించాలని కుటుంబపెద్దలు సూచించటం వల్ల భక్తి శ్రద్ధలతో పూజలు చేసినట్టు మహేశ్ తెలిపాడు. ఈ విషయం తెలిసి చుట్టూ ప్రక్కల ప్రజలు కూడా పుష్పాలను వీక్షించేందుకు తరలివస్తున్నారని తెలిపారు. ఈ పుష్పాలను చరావాణుల్లో ఫొటోలు తీసుకుని ఆనందిస్తున్నారని మహేశ్ పేర్కొన్నాడు.
ఇవీ చూడండి: