నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటేగాం వద్ద భాజపా నేతలు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద మాటేగాం నుంచి కుంటాల మండలం లింబాబి వరకు రహదారి మంజూరైంది. ప్రోటోకాల్ ప్రకారం ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరును శిలాఫలకంలో ఐదో స్థానంలో వేశారంటూ భాజపా నేతలు ఆందోళన చేపట్టారు.
రహదారి నిర్మాణానికి బాపూరావు.. రూ.9 కోట్లు మంజూరుచేశారని ముధోల్ ఎంపీటీసీ తెలిపారు. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఆర్థిక లోటు భర్తీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని విన్నపం