ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్ బస్ డిపో ముట్టడికి భాజపా నాయకులు యత్నించారు. ర్యాలీగా వచ్చిన కమల కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపోలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష