ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే జీహెచ్ఎంసీలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారని కేంద్ర విత్తన పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యులు అయ్యన్నగారి భూమయ్య అన్నారు. తెలంగాణ అసెంబ్లీని మంగళవారం ముట్టడించేందుకు భాజపా రాష్ట్రశాఖ పిలుపుమేరకు భాజపా, బీజేవైఎం నాయకులను నిర్మల్ జిల్లా కేంద్రంలో ముందస్తు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చట్టం తీసుకురావడం సరికాదని భూమయ్య విమర్శించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనలు తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తెరాస పార్టీ మైనారిటీ జపం చేస్తుందని విమర్శించారు. వచ్చే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. వారిలో నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, అయ్యన్నగారి రాజేందర్, ఒడిసెల అర్జున్, గిల్లి విజయ్, శ్రవణ్ కుమార్, బాబా తదితరులున్నారు.
ఇదీ చూడండి: 'అరెస్టుల పేరుతో భౌతిక దాడులు సరికాదు'