నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన వార్డుల విభజన అవకతవకలపై భాజపా ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు. భైంసా మున్సిపల్ వార్డుల విభజన ఏకపక్షంగా చేసి వ్యవస్థను అస్తవ్యస్తం చేసారని నేతల ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదులు స్వీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వైఖరికి నిరసనగా నిర్మల్-భైంసా రహదారిపై దాదాపు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. పోలుసులకు కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన కారులను చెదరగొట్టిన పోలీసులు... రమాదేవిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి: ఇంజినీరింగ్‌లోకి ఏడు కొత్త కోర్సులు వచ్చాయి!