ETV Bharat / state

బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనం... యువకుడు మృతి - ACCIDENT NEWS IN NIRMAL

ఎదురుగా వస్తున్న బస్సును వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం నిర్మల్​ జిల్లా కంచెరోని చెరువు వద్ద జరిగింది.

BIKE COLLIDE WITH BUS ONE DIED IN ACCIDENT

author img

By

Published : Dec 21, 2019, 11:25 PM IST

నిర్మల్ జిల్లాలోని కంచెరోని చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. నిర్మల్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న సమయంలో దిలావర్‌పూర్ మండలం కొత్తలోలానికి చెందిన నరేశ్.... ద్విచక్రవాహనంపై నిర్మల్ వైపు వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న బస్సును వేగంగా ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం ఎక్కువగా ఉండటం వల్ల ఘటనాస్థలంలోనే మృతిచెందాడు.

ఈ ప్రమాదం వల్ల రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్​ని పునరుద్ధరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నరేశ్... లోలం గ్రామానికి చెందిన పాపన్న, నర్సవ్వ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు. ఎదిగొచ్చిన కొడుకు అనుకోనిరీతిలో మృతిచెందగా... తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనం... యువకుడు మృతి

ఇదీ చూడండి: సరకు రవాణాకు.. సిద్ధం కాబోతున్న ఆర్టీసీ బస్సులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.