తెలంగాణలో గోదావరి ఉరకలెత్తేందుకు సమాయత్తమవుతోంది. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జులై 1న తెరుచుకోనున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షక కమిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు బుధవారం ప్రాజెక్ట్టుకు చెందిన 14 గేట్లను ఎత్తనున్నారు. మహారాష్ట్రలో నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలు ఈ సంవత్సరం గరిష్ఠ నీటిమట్టాలతో నిండుగా ఉండటంతో ఈసారి వరద నేరుగా ఎస్సారెస్పీకి చేరేందుకు అవకాశం ఉంది.
అక్టోబర్ 28న మూసివేత
బుధవారం ఉదయం గేట్లను ఎత్తితే కందకుర్తి మీదుగా నదీ ప్రవాహం బాసరకు చేరనుంది. 120 రోజులపాటు గోదావరి ప్రవాహానికి ఆటంకాలు ఉండని నేపథ్యంలో మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఎస్సారెస్పీ నిండుతుంది. తిరిగి అక్టోబరు 28న గేట్లను మూసివేస్తారు.
ప్రాజెక్టులకు స్వల్ప ప్రవాహాలు
రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలకు పలు ప్రాజెక్టులకు స్వల్పంగా ప్రవాహం వస్తోంది. తుంగభద్రకు నాలుగు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నాగార్జునసాగర్‌కు కొంత ప్రవాహం పెరిగింది. మరోవైపు గతేడాది ఇదే రోజు కన్నా కనిష్ఠ స్థాయికి సింగూరులో నీటి మట్టం స్థాయి పడిపోయింది. ప్రస్తుతం 0.39 టీఎంసీˆల నీళ్లు ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 0.42 టీఎంసీˆల జలాలు ఉన్నాయి.