నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం కన్నులపండువగా సాగింది. సిద్దు గురుస్వామి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామికి వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు.
పడి పూజ నిర్వహించిన స్వామి 18వ సారి మాలాధారణ స్వీకరించడంతో నిర్మల్ అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో కొబ్బరిచెట్టు, యోగ దండన అందజేసి సత్కరించారు. పూజ కార్యక్రమానికి స్వాములతో పాటు స్థానిక భక్తులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్పల భజన పాటలతో అక్కడి ప్రాంగణం స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది.
ఇదీ చదవండి: రికార్డ్ సృష్టించిన దక్షిణ కొరియా 'సూర్యుడు'