ETV Bharat / state

వర్షాకాలంలో పశువులను వెంటాడుతోన్న అంటు వ్యాధి - నిర్మల్ జిల్లా తాజా వార్తలు

నిర్మల్​ జిల్లాలో పశువులను రెండు నెలలుగా లంపీ స్కిన్ డిసీజ్ వెంటాడుతోంది. అది అంటువ్యాధి కావడం వల్ల అక్కడ ఉన్న పశువులకు సైతం విస్తరిస్తోంది. ఆ వ్యాధి పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. సరైన మందులు లభించడం లేదని వాపోతున్నారు.

An infectious disease that haunts cattle during the rainy season at niraml
వర్షాకాలంలో పశువులను వెంటాడుతోన్న అంటు వ్యాధి
author img

By

Published : Aug 21, 2020, 8:26 PM IST

నిర్మల్ జిల్లాలో పశువులను రెండు నెలలుగా లంపీ స్కిన్ డిసీజ్​ వెంటాడుతోంది. అది అంటువ్యాధి కావడం వల్ల ఒకదాని నుంచి మరో పశువుకు వ్యాపిస్తోంది. పశువుల చర్మంపై బొబ్బలు, బొడిపెలు రావడం వల్ల తొలుత ఎలుకలు కొరికాయనుకున్నారు. కానీ పశువైద్యుల వద్దకు తీసుకెళ్లి సంప్రదించగా ప్రమాదకరమైన చర్మ(ఎల్ఎడీ) వ్యాధిగా గుర్తించారు. ఆ ప్రభావం ఎద్దులు, ఆవులు, దూడలపై అధికంగా ఉందన్నారు. ఆ వ్యాధి నల్లజాతి గేదెలపై లేదని చెబుతున్నారు.

ఆవులు, ఎద్దులు

జిల్లాలో దాదాపు మొత్తం 3 లక్షల పశువులుండగా.. అందులో లక్షా 79 వేల వరకు తెల్ల జాతి ఆవులు, ఎద్దులు, దూడలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఈ వైరస్ బారిన పడుతున్నాయని అన్నారు. వ్యవసాయ పనుల సమయంలో ఎద్దులకు ఆ వైరస్ సోకడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

అందుబాటులో ఉంచాలని

తమ ఎద్దులకు రూపాయి బిల్ల మాదిరి వాపులు వస్తున్నాయని.. గత 10 రోజుల నుంచి అవి పెద్దగా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. అది ఒక రకమైన వైరస్ అని, మూడు రోజుల పాటు ఇంజక్షన్ వేయాలని వైద్యులు చెప్పారని అన్నారు. వ్యవసాయ పనులకు తోడుగా ఉండే ఎడ్లకు ఇలా కావడం బాధేస్తుందని రైతులు అంటున్నారు. పశువుల ఆస్పత్రిలో ఈ వైరస్ రాకుండా మందులున్నాయని.. కానీ వచ్చిన వాటికి డోసులు లేవని ప్రైవేటుగా తెప్పించుకోవాలని డాక్టర్లు అంటున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లా పశువైద్య అధికారులు స్పందించి పశువులకు వైరస్​కు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

పశువులను వేరుగా ఉంచాలి

లంపీ స్కిన్ డిసీజ్​ అధికంగా తెల్లజాతి ఆవులు, ఎద్దులకు వస్తోందని వైద్యులు తెలిపారు. ఆ వైరస్ వచ్చిన పశువులను వేరుగా ఉంచాలని వైద్యులు సూచించారు. అంటువ్యాధి కారణంగా అప్రమంత్తంగా ఉండాలన్నారు. చిన్న దూడల మీద కూడా అధికంగా వస్తుందన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో వాటిని సురక్షిత ప్రాంతంలో ఉంచడం మంచిదని తెలిపారు.

ఇదీ చూడండి : శ్రీశైలం ప్రమాద కుటుంబాలకు పరిహారం ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.